సుధీర్ బాబు,నాని ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. అయితే మల్టి స్టారర్ సినిమాలు కామన్ అయిన ఈ రోజుల్లో అందులో వింతేముంది అంటే… సుధీర్ బాబు హీరోగా, నాని విలన్ గా కనిపించటమే. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలోనే నాని విలన్ గా కనిపించబోతున్నారు. సుధీర్ బాబు సైతం ఈ మధ్యన ఇంద్రగంటి డైరక్షన్ లో సినిమా చేసి హిట్ కొట్టారు. దాంతో ఆయన మరో సినిమా అదే దర్శకుడుతో చేయటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు.
ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునే కథ ప్రకారం ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ అధికారి గా నటిస్తుంటే.. నాని అతడికి విలన్ గా మారతాడు. సుధీర్ బాబు పాత్రకు టార్చర్ పెడతాడని, ఇద్దరి మధ్యా గేమ్ ఓ రేంజిలో ఉంటుందని అంటున్నారు. అయితే నాని అలా నెగిటివ్ గా కనిపించటానికి ఓ రీజన్ ఉంటుంది. కథ ప్రకారం ఇద్దరి పాత్రలకి సరైన ప్రాధాన్యత ఉండబోతోంది. కథ విన్న నాని, సుధీర్ బాబులు చాలా ఎగ్జైట్ అయ్యి సింగిల్ సిటింగ్ లో ఓకే చేసేసారట. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు.
ఇక ఈ సినిమాను నాని మరో దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమా చేస్తూనే చేస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ఆరంభంలో కానీ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు నాని డేట్స్ మరీ ఎక్కువ అవసరం పడవని సమాచారం.