భార్య వల్ల కెరీరే పోగొట్టుకున్న స్టార్ డైరెక్టర్ ! 

టాలీవుడ్ లో పదేళ్ల క్రితం వరకూ ‘కృష్ణ వంశీ’ అంటే ఒక క్రియేటివిటీ, ఒక పెర్ఫెక్షన్. నిన్నటి తరం  క్రియేటివ్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ ‘కృష్ణ వంశీ’దే. సహజంగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ చేసేవాళ్ళు ఫుల్ కమర్షియల్ సినిమాలు చేయలేరనేది సినిమా వాళ్ళకు ఆనవాయితీగా వస్తోన్న మాట. ఈ మాటను బ్రేక్ చేసిన హిస్టరీ కృష్ణ వంశీది. మరి అలాంటి డైరెక్టర్ ప్రస్తుత పరిస్థితి గురించి ఒక్క ముక్కలో చెప్పపాలంటే.. ఒకటి రెండు హిట్స్ ఉన్న హీరోలు కూడా డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. హీరోయిన్ రమ్యకృష్ణతో చాలా సంవత్సరాలు ప్రేమ వ్యవహారం నడిపి ఫైనల్ గా రమ్యకృష్ణనే వివాహం చేసుకుని.. అటు పర్సనల్ లైఫ్ కి ఇటు ప్రొఫెషనల్ లైఫ్ కి మధ్యలో నలిగిపోయి, చివరకు ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటిలో ఒంటరిగా స్క్రిప్ట్ లు రాసుకుంటూ.. రాసుకున్నవి నచ్చక చించేస్తూ కాలం నెట్టుకొస్తున్నాడు ప్రస్తుతం కృష్ణవంశీ.

star-director-who-lost-his-career-
krishnavamsi

పాపం గత కొన్ని సంవత్సరాలుగా రమ్యకృష్ణ అండ్ కృష్ణ వంశీ బంధం అంత గట్టిగా లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. ఒకవిధంగా కృష్ణవంశీ కెరీర్ డౌన్ కావడానికి కారణం పర్సనల్ లైఫ్ లోని లోటే  కారణం అట. తప్పు ఎవరదైనా ఎవరి స్వభావం వారిది. రమ్యకృష్ణ ఒక బోల్డ్ హీరోయిన్.. పైగా పాతికేళ్ల క్రితమే బికినీలు వేసిన హీరోయిన్. రమ్యకృష్ణలోని ఆ బోల్డ్ కారణంగా సహజమైన ఇల్లాలుగా మారలేకపోయింది. ఎదుగుతున్న కొడుకు ఉన్నా ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నిల్ ఇస్తోంది. రీసెంట్ గా లెక్కకు మించిన బీరు బాటిల్స్ తో చిక్కి తన లైఫ్ స్టైల్ ఏమిటో మొత్తానికి పబ్లిక్ కి వెలిగెత్తి చాటుకుంది. మరి ఇలాంటి హీరోయిన్ తో తన కాపురం సరిగ్గా జరుగుతుందనుకోవడం అది ఈ క్రియేటివ్ డైరెక్టర్ చేసిన మొదటి తప్పు ఏమో. నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణవంశీ హైదరాబాద్ లో ఉంటుండగా  రమ్యకృష్ణ మాత్రం చెన్నైలో ఉంటూ వస్తున్నారు. అప్పటి నుండే కృష్ణవంశీ సక్సెస్ కి దూరమయ్యాడట.

ఏమైనా క్రియేటివ్ డైరెక్టర్ గా ఒకప్పుడు మంచి సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం వరుస ప్లాప్ లతో డీలా పడటం, పైగా అందుకు కారణం కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కావడం.. అందులో ఆమె ఈయనకి భార్య కావడం బాధాకరమైన విషయమే. అసలు ఈ డైరెక్టర్ తన భార్య కారణంగా కేరీర్ పై ఫోకస్ చేయలేకపోవడం ఏమిటి..? ఈయనగారి అభిమానులను ఈ వ్యవహారం బాధ పెట్టేదే. ఇప్పటికే ఈయన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద  విజయం సాధించలేక డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి.  స్టార్ హీరోలందరూ ఎప్పుడో దూరం అయిపోయారు. పాపం కృష్ణవంశీ.