(ధ్యాన్)
దేవదాస్ కాపీ సినిమా అని ఈ మధ్య సోషల్ మీడియా అందరూ తెగ చెవులు కొరుక్కున్నారు. అయితే తమ సినిమా, ఏ సినిమాకూ కాపీ కాదని కచ్చితంగా చెప్పేశాడు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. కోర్ పాయింట్ మాత్రం ఇందులో ఫ్రెండ్‌షిప్ అని ఆయన అన్నారు. చాలా ఒరిజినల్ సబ్జెక్ట్ అనీ, సత్యానంద్‌తో పాటు పలువురు రచయితలతో కూర్చుని తాను ఈ స్క్రిప్ట్ ని లాక్ చేసినట్టు తెలిపారు. ఈ సినిమా ఫలానా సినిమాకు కాపీ అట కదా.. అని అడిగిన విలేకరితో `అలా ఎవరన్నారు.. అసలు అలాంటిదేమీ కాదు. అవన్నీ ఉత్తుత్తి మాటలే. సినిమా విడుదలైతే మీకే తెలుస్తుంది` అని అన్నారు. మరోవైపు సినిమా ఔట్‌పుట్ మీద నాగార్జున అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నాగార్జునకు సినిమా చూపించారట. దాంతో ఆయనకు అందులో మార్పులు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి ఉన్నట్టు సమాచారం. కనీసం భవిష్యత్తులో చేసే సినిమాలనైనా విడుదలకు నెల రోజుల ముందే టేబుల్ మీద పెట్టమని సూచించాడు శ్రీరామ్ ఆదిత్యకు. పైగా ఈ టోటల్ టీమ్‌లో తనకు మళ్లీ మళ్లీ పనిచేయాలనిపించింది ఒక్క కెమెరామేన్ శ్యామ్‌తోనే అని అన్నారు. అంటే మిగిలిన వాళ్లతో పెద్దగా కంఫర్టబుల్ లేనట్టేగా…