జాకీ ఒంపుసొంపులు నయగరా జలపాతాలు
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ చిత్రం `సాహో`లో కేవలం మూడే మూడు పాటలు అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాయి. వీటిలోంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజయ్యాయి. ఎన్ని సోని…, సైకో సయ్యాను అంటూ సాగే పాటల్ని రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలు విజువల్ గా ఎంతో బ్యూటిఫుల్ గా కనిపించినా.. లిరిక్ పరంగా లిప్ సింక్ కోసం పాకులాట కనిపించింది. ఏదో డబ్బింగ్ సాంగ్ వింటున్నట్టే అనిపించింది. ఒకరకంగా ఈ పాటల్ని బాలీవుడ్ కోసం రెడీ చేసి తెలుగులో అనువదించారా? అనిపించక మానదు.
తాజాగా బ్యాడ్ బోయ్ అంటూ మరో హాట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటలో విదేశీ మోడల్స్ తో ప్రభాస్ వేడెక్కించే స్టెప్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ మేనివిరుపుల డ్యాన్సులు అభిమానులకు స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. లిరిక్ ఎలా ఉన్నా విజువల్ గా వెరీ హాట్ & బోల్డ్ సాంగ్ ఇది. థియేటర్లలో మాస్ నుంచి క్లాప్స్, విజిల్స్ పడడం ఖాయం. జాక్విలిన్ ఇటీవలే ఏక్.. దో .. తీన్ అంటూ రీమిక్స్ సాంగ్ తో రఫ్ఫాడించింది. మరోసారి సాహోలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు అదిరిపోయే ట్రీటివ్వబోతోంది. ఈ పాటను ఆదివారం సాయంత్రం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరిగిన భారీ ఈవెంట్లోనూ రిలీజ్ చేశారు.