శ్రీదేవి జీవితంపై రానున్న బుక్

బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా పెళ్ళిక‌ని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్ర‌వ‌రి 24,2018న బాత్ ట‌బ్‌లో మునిగి క‌న్ను మూసింది . రాష్ట్రం, దేశం అని కాకుండా ప్ర‌పంచ‌మంతటా ఉన్న ఎంద‌రో అభిమానుల ఆద‌ర‌ణ పొందింది శ్రీదేవి. నాలుగో ఏటనే తమిళ సినిమాలో నటించింది శ్రీదేవి. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా బాలనటిగా అనేక పాత్ర‌లు పోషించింది . జూలీ సినిమాతో హిందీలోకి అడుగిడిన శ్రీదేవి తన పదహారో ఏట పదహారేళ్ల వయసు సినిమాలో చేసింది. అప్పట్లో ఆ సినిమా మంచి హిట్.

ఇప్పుడు కూడా శ్రీదేవి పేరు చెబితే… చాలామందికి ఆ సినిమా గుర్తొస్తుంది. ఆమె జ‌యంతి సంద‌ర్భంగా ప్రముఖ పబ్లిషర్స్‌ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తక రూపంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందుకు ఆమె భ‌ర్త బోనికపూర్‌ అనుమతి కూడా తీసుకున్నార‌ట‌. ‘శ్రీదేవి : గర్ల్‌ ఉమెన్‌ సూపర్‌ స్టార్‌’ పేరుతో రూపొందుతున్న ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సత్యార్థ నాయక్‌ రాస్తున్నారు. శ్రీదేవి లాంటి గొప్ప తార‌పై జీవితం రాసే అవ‌కాశం రావ‌డం చాలా ఆనందంగా ఉంది.