కత్తి మహేష్, శ్రీ రెడ్డి వీళ్లిద్దరులో ఒ కామన్ పాయింట్ ఉంది..అది ..ఇద్దరూ పవన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పలు సంచలన వ్యాఖ్యానాలు చేసి పేరు తెచ్చుకున్నవాళ్లే. అయితే ఇద్దరూ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. శ్రీ రెడ్డి అయితే అప్పుడప్పుడూ పోస్ట్ లు పెట్టి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది కానీ..ఫలించటం లేదు. ఈ నేపధ్యంలో ఇద్దరూ కలిసారు. ఎక్కడ కలిసారో తెలిసారో కానీ ఏ పాయింట్ మీద కలిసారో అర్దమవుతోంది.
వాళ్లిద్దరూ కలిసి దిగిన ఆ ఫోటోలను శ్రీరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎవరి ఫేస్ చేస్తే పీకే ఫ్యాన్స్ రక్తం ఉడుకుతుందో వాడే కత్తిగాడు అంటూ ఒక క్యాప్సన్‌ని కూడా వదిలింది. అయితే ఈ ఫొటో ఎవరిని ఎట్రాక్ట్ చేసాయి అంటే పవన్ ఫ్యాన్స్ నే. అయితే వాళ్లు లైట్ తీసుకున్నట్లున్నారు. అక్కడక్కడా ఈ పోస్ట్ మీద కామెంట్స్ రాసారు కానీ పెద్దగా సంచలనం కలగలేదు. కత్తి మహేష్ నగర బహిష్కరణ తర్వాత ..టీవి ఛానెల్స్ వారు కూడా పక్కన పెట్టేయటంతో ఈ ఫొటో రచ్చ లేపలేకపోయింది.