జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో మళ్లీ ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన ఆమె ఈ మధ్యకాలంలో పవన్ పై తను విమర్శలు తగ్గించిన మాట వాస్తవమేనని, అంత మాత్రాన పవన్ ను పూర్తిగా వదిలినట్లు కాదని, వదిలేది లేదని స్పష్టంచేసింది.
శ్రీరెడ్డి లైవ్ లో మాట్లాడుతూ..”పవన్ కు ఇంకాస్త టైం ఉంది. అతడిపై పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతాను. ఎవర్నీ వదిలిపెట్టేది లేదు. నా శపథం నెరవేర్చుకుంటాను. పవన్ ను ఆయన స్థానంలోనే ఓడిద్దాం. ఆయన ఎక్కడ నామినేషన్ వేస్తారో చూసి అక్కడే ఓడిద్దాం.” అని చెప్పింది.
అలాగే జీవన్ రెడ్డిని ఓడించమని పిలుపు ఇచ్చింది. జీవన్ రెడ్డి గురించి చాలా దారుణంగా ఆరోపణలు చేసిన ఆమె..అలాంటి వ్యక్తికి ఓటేయవద్దని అంది. ఇక రేవంత్ రెడ్డికి ఓటేయమని కూటమిని గెలిపించమని కోరింది. టీఆర్ఎస్ ని ఓడించమని, కేటీఆర్, కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడింది. తను ఎక్కువ మాట్లాడితే కక్ష సాధింపు చర్యలకు దిగుతారని, అందుకే చెన్నై వచ్చినట్లు చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ..”టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎందుకు మూసేశారు. ఒకవేళ అది క్లోజ్ అవ్వకపోతే అప్ డేట్స్ ఏంటి. ఎవరు సప్లయ్ చేస్తున్నారు. ఎవరు వాడుతున్నారు. ఆ వివరాలు మీకు తెలియదా. మీరు ఐటీమంత్రి. నేను ఏదైనా నిజం మాట్లాడితే, మీ ఐటీ యంత్రాంగాన్ని ఉపయోగించి సోషల్ మీడియాలో నా జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తారు.
పార్క్ హయత్ రాసలీలల్ని మీరెందుకు సీరియస్ గా తీసుకోరు. అప్పటి రాసలీలల్లో పేర్లన్నీ నాకు తెలుసు. పార్క్ హయత్ రాసలీలల్ని బయటపెడితే తనను హైదరాబాద్ రానివ్వరని, హైదరాబాద్ లో ఉన్న ఇంటిని కూడా తనకు దక్కకుండా చేస్తారంది శ్రీరెడ్డి. మరి శీరెడ్డి మాటలను ఎంత వరకూ సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.