ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను గొప్ప సాధనంగా మలుచుకుంటున్న అందాల భామలెందరో ఉన్నారు. అయితే ఈ భామలపై నెటిజనులు పెడుతున్న పోస్టులు వారికి చిర్రెత్తుకొస్తున్నాయి. అందులో మొదటి వరుసలో ఉంటుంది బ్యూటీ శ్రద్ధాదాస్.
ఇటీవల శ్రద్ధపై నెటిజనులు తీవ్రంగా పోస్టులు పెడుతూ ఆమెను సోషల్ మీడియా లోకి లాగుతున్నారు. అయితే ఇవేమీ తను పట్టించుకోను అంటోంది. అలా అంటూనే వారి ప్రశ్నలకు తిరిగి పోస్టులు పెడుతూ సమాధానాలు ఇస్తోంది. నెటిజనులపై ఎందుకు మండిపడుతున్నారు? అని ఇటీవల కలిసిన శ్రద్ధాదాస్ ను అడిగితే- ‘‘ నేను నటించినవి కొన్ని చిత్రాలేనైనా అవి నాకు నచ్చినవే. నేను చేసిన చిత్రాలు, నేను పోషించిన పాత్రలు అన్నీ నాకు నచ్చి చేసినవే. అయితే నా చిత్రాలు చూడకుండానే సోషల్ మీడియాలో నెటిజనులు తీవ్రంగా పోస్టులు పెడుతూ నన్ను అనవసరంగా తట్టిలేపుతున్నారు. వారి పోస్టులు నేను ఏ మాత్రం పట్టించుకోను. నా దృష్టిలో ప్రేక్షకులను మెప్పించిన ఏ చిత్రమైనా పెద్దదే’’ అన్నారు.
ఇంతకీ నెటిజనులు పెట్టిన ఆ పోస్టులు ఏమిటో మాత్రం చెప్పనే చెప్పలేదు. అమ్మో శ్రద్ధ గొప్ప నటే .. ఏమంటారు?