దివ్య‌భార‌తి, శ్రీ‌దేవి, సుశాంత్ .. ఇవ‌న్నీ హత్య‌లే!- అర్నాబ్ గోస్వామి

                                     రిప‌బ్లిక్ చానెల్ యాంక‌ర్ పై ఆర్జీవీ సినిమా

ఆర్జీవీ వ‌ర్సెస్ రిప‌బ్లిక్ చానెల్ అర్నాబ్ గోస్వామి ఎపిసోడ్స్ ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ట్వీట్ వార్ వైర‌ల్ గా మారింది. దివ్య భారతి, శ్రీదేవి మరణాలపై అర్నబ్ షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ లో అంత‌కంత‌కు వేడెక్కిస్తున్నాయి. బాలీవుడ్ మాఫియా పైనా హీరోల లైంగిక వేధింపుల‌పైనా ఆర్నాబ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో దానికి ఆర్జీవీ కౌంట‌ర్లు స్టార్ట్ చేశారు.

సుశాంత్ సింగ్ స‌డెన్ డెత్ వెన‌క బాలీవుడ్ మాఫియా ఉంద‌ని ఆరోపించిన అర్నాబ్ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌లువురు క‌థానాయిక‌ల స‌డెన్ డెత్ ల‌ను ప్ర‌స్థావిస్తూ అవ‌న్నీ మాఫియా నీడ‌లో జ‌రిగిన‌వేన‌ని వ్యాఖ్యానించారు.

అయితే అర్నాబ్ గోస్వామి ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగుతుంటే ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, మహేష్ భట్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ప్ర‌ముఖులు ఎందుకు బయపడుతున్నారు? అంటూ ఆర్జీవీ గిల్లి గిచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

చాలా మంది బాలీవుడ్ స్టార్లు కూడా ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడంలేదని వారు మౌనంగా ఉంటే కచ్చితంగా తప్పుచేసినట్టే అవుతుందని వర్మ రివ‌ర్సులో కౌంట‌ర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. అంతేకాదు.. అర్నాబ్ గోస్వామి పై న్యూస్ వేశ్య లేదా న్యూస్ పింప్ అనే పేరుతో సినిమా తీస్తాన‌ని కూడా ఆర్జీవీ చ‌లోక్తి విసిరారు. రిప‌బ్లిక్ చానెల్ న్యూస్ యాంక‌ర్ అర్నాబ్ పై మొత్తానికి ఆర్జీవీ ట్విట్ట‌ర్ వార్ సంచ‌ల‌నంగా మారింది.