లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బాలు పాట

రామగోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా షూటింగ్ విషయాలు ఏమి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు . ఈ సినిమాను బాలకృష్ణ సినిమాకు పోటీగా జనవరి 24న విడుదల చేస్తామని ప్రకటించాడు . అందుకే షూటింగ్ వెంటనే మొదలు పెట్టి చేస్తున్నట్టు సమాచారం . వై ఎస్సార్ పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నాడు . అయితే బాలకృష్ణ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం జనవరి 24 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు . ఇది  డిస్ట్రిబ్యూటర్లు  ఒప్పుకోవడం లేదని ఈ విడుదలను ఫిబ్రవరి 14కు  మార్చారు . అయితే డిస్ట్రిబ్యూటర్లు  కోరిక మేర మార్చారా ? లేక రామ్ గోపాల్ వర్మ  సినిమా మీద వేయడం ఎందుకని పోస్టుపోన్ చేశారా అనేది తెలియదు .

ఇక రామ్ గోపాల్ వర్మ  లక్ష్మీస్ ఎన్టీఆర్  కోసం సిరాశ్రీ రాసిన గీతాన్ని బాలసుబ్రమణ్యం ఆలపించినట్టు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు .