సెప్టెంబర్ లో ‘సైమా’ అవార్డుల పంక్షన్

(సైమా) సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్  ఫంక్షన్ గ్రాండ్ గా జరగబోతోంది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

 

సెవెంత్ ఎడిషన్ సైమా అవార్డ్స్ ఫంక్షన్ సెప్టెంబర్ 7,8 తేదీలలో దుబాయ్ లో వైభవంగా జరగనుంది. 7వ ఎడిషన్ సైమా అవార్డ్స్ మరింత కలర్ ఫుల్ గా జరగనుంది. గతంలో సైమా అవార్డ్స్ దుబాయ్, అబుదబి, షార్జాహ్, మలేషియా, దుబాయ్, సింగపూర్, అబుదబి లో జరిగింది. ఈసారి దుబాయ్ లో ఈ వేడుక జరగబోతోంది.

 

సినీ ప్రముఖుల మధ్య జరగబోతున్న ఈ వేడుక ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్ట్ పాల్గొనబోతున్న సైమా అవార్డ్స్ టైటిల్ స్పాన్సర్ హిమాలయ ఫేస్ వాష్. ఈ అవార్డ్స్ కు సంభందించిన మరింత సమాచారం త్వరలో తెలియబోతోంది.