బాడీ గార్డ్ చేతిలో దెబ్బలు తిన్న రణవీర్ సింగ్..? వైరల్ అవుతున్న వీడియో!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రణవీర్ సింగ్ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. ఇలా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రణవీర్ సింగ్ ఇటీవల బెంగళూరులో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమానికి హాజరయ్యాడు. రెండు రోజులపాటు జరిగిన ఈ అవార్డు కార్యక్రమంలో సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరో హీరోయిన్లు నటీనటులు పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రణవీర్ సింగ్ కూడా ఈ అవార్డు కార్యక్రమంలో సందడి చేశాడు.

బెస్ట్ హిందీ యాక్టర్ అవార్డు అందుకోవటానికి ఈ కార్యక్రమానికి హాజరైన రణబీర్ సింగ్ తనదైన శైలిలో సందడి చేశాడు. ఈ క్రమంలో అభిమానులు రణవీర్ సింగ్ తో సెల్ఫీలు తీసుకోవటానికి తెగ ఆరాట పడిపోయారు. దీంతో అభిమానుల నుండి రణవీర్ సింగ్ ని కాపాడటానికి అతని బాడీగార్డ్స్ కూడా చాలా శ్రమించారు. ఈ క్రమంలో పొరపాటున బాడీగార్డ్ చెయ్యి రణవీర్ సింగ్ చంపకు తగిలింది. దీంతో దెబ్బ తగలటంతో రణవీర్ సింగ్ గట్టిగా చంపని పట్టుకున్నాడు. కానీ పొరపాటున అలా జరిగిందని గ్రహించి నవ్వుతూ అందరితో సెల్ఫి దిగాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ అవార్డ్ కార్యక్రమంలో రణవీర్ సింగ్ యాంకర్ శ్రీముఖిని హత్తుకొని ఆమె చేతిపై ముద్దు పెట్టడంతో శ్రీముఖితో పాటు అక్కడున్నవారందరు షాక్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో తనకి ముద్దు పెట్టడంతో శ్రీముఖి ఆనందం పట్టలేకపోతోంది. ఇక ఈ కార్యక్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రణవీర్ స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నాడు.