ఆమె ఆవేదన వింటే మనకూ ఏడుపొచ్చేస్తుంది

తెలుగులో మురారి, ఇంద్ర, ఖడ్గం వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన సోనాలి బింద్రే గుర్తుండే ఉండి ఉంటుంంది. ఆ తర్వాత బాలీవుడ్‌  లో సినిమాలు చేసి వివాహం చేసుకుని నటనకు బై చెప్పింది. అయితే ఈ మధ్యన సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ మరోసారి మీడియాలో హైలెట్ అయ్యింది.

కాన్సర్ కు ఆమె గత కొద్దినెలలుగా  న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటోంది. ఆమె ఆరోగ్య పరిస్దితిపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ రీసెంట్ గా తెలిపారు. కాగా, చికిత్స క్రమంలో ఆమె చాలా నొప్పిని భరిస్తున్నట్లు ఆమె   చెప్పారు. తన ఆవేదనను తెలుపుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌  పెట్టారు. దీంతోపాటు ఆమె లేటెస్ట్ ఫొటోను షేర్‌ చేశారు.ఆ పోస్ట్ చదువుతూంటే మనకే కన్నీరు వస్తుంది. అలా ఉంది.

 

‘గత కొన్ని నెలలుగా నేను మంచిని, చెడును రెండింటిని ఎదుర్కొన్నాను. నేను కొన్నిసార్లు ఎంత బలహీన పడ్డానంటే….   కనీసం నా చేతి వేలు సైతం  ఎత్తడానికి శక్తిలేకుండాపోయింది. ఇది కూడా ప్రాసెస్ లా అనిపిస్తోంది. ఫిజికల్ గా ప్రారంభమైన ఈ పెయిన్.. మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బకొడుతోంది. కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైంది.. కనీసం నవ్వినా నొప్పిగా అనిపించేది. అయితే ఆ సమస్యలను ఎదుర్కుంటూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. అలాగే ఇప్పుడు నా చికిత్స కొనసాగుతోంది.. నా రూపు కాస్త  చక్కగా మారింది. త్వరలో ఇంటికి వచ్చేస్తాను’ అన్నారామె.