నా న్యూడ్ క్లిప్ మా అమ్మకు పంపారు,ఇబ్బందిపడ్డా

                                                                         (సూర్యం)

వివాదం లేకపోతే ఆమెకు ఒక్క క్షణం గడవదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆమె చుట్టూ తిరుగుతుంది. లేదా ఆమే వివాదం చుట్టూ ప్రయాణం పెట్టుకుంటుంది. మీ గెస్సింగ్ కరెక్టే…ఈ మధ్యకాలంలో వరసగా కాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేస్తూ వస్తున్న రాధికా ఆప్టే గురించే మేము చెప్పేది. తాజాగా ఆమె వివాదాన్ని రాజేసింది.  నా న్యూడ్ వీడియో క్లిప్ ని మా అమ్మకు పంపారు అంటూ..

రాధికా అప్టే మీడియాతో మాట్లాడుతూ…నేను ఆశ్చర్యపోయాను..మా అమ్మ పిలిచి మరీ ఇదేంటి అని అడిగేసరికి. చూస్తే అది నేను వేరొకరితో ఉండగా తీసిన శృంగార వీడియో  క్లిప్. ఏం సమాధానం చెప్పగలను. ఏ తల్లితో అయినా ఈ విషయాలు కూతురు మాట్లాడగలదా..కానీ పరిస్దితి తప్పలేదు.

మా అమ్మకు ఆ పంపిన వాళ్లు ఏం సాధిద్దామనుకున్నారో..మా అమ్మ చిన్నబుచ్చుకుంది కానీ ఇలాంటి పరిస్దితులు ఎదురు కాకుండా ఉండమని చెప్పింది. నిజానికినా న్యూడ్ వీడియో క్లిప్ లు బయిట సర్కులేట్ అవుతున్నాయని కూడా నాకు తెలియదు. ప్రతీ సారీ నాకే ఎందుకిలా జరుగుతోంది అని తెగ బాధపడిపోయింది రాధికా ఆప్టే. అవును మరీ శాడిజం కాకపోతే న్యూడ్ క్లిప్ లు ఆమె తల్లికి పంపండం ఏమిటి..చెప్పండి