సితార కు మహేష్ అరుదైన బహుమతి

సితార కు మహేష్ అరుదైన బహుమతి

కాశ్మీర్ లో మహేష్ బాబు , నమ్రత ముద్దుల కూతురు సితార జన్మదినోత్సవం గ్రాండ్ గా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు .

రేపు అంటే శనివారం నాడు సితార ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది . ప్రస్తుతం మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరూ ” చిత్రం షూటింగ్ కోసం కాశ్మీర్ లో వున్నారు . నమ్రత ,గౌతమ్ , సితార ఈరోజు ఉదయమే కాశ్మీర్ వెళ్లిపోయారు .

“సరిలేరు సినిమా ” షూటింగ్లో మహేష్ బాబు కాశ్మీర్లో ఉండటం వాళ్ళ అక్కడనే సితార జన్మదిన వేడుకలు జరిపించడానికి మహేష్ బాబు ఏర్పాట్లు చేయిస్తున్నట్టు తెలిసింది. ప్రతి సంవత్సరం తన పిల్లలు గౌతమ్, సితార బర్త్ డైలను మహేష్ దగ్గరుండి జరిపిస్తారు . వారి బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు సితార కు ఎలాంటి బహుమతి ఇస్తారో ?