విజయదేవరకొండ కొత్త చిత్రం ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్

వరస హిట్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ వరస సినిమాలు చేసేస్తున్నాడు. ఓ పక్క ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తూ, మరోపక్క క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కెయస్ రామారావు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇల్లెందులో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కొత్తగూడెంలో జరుగుతోంది. అక్కడ విజయ్ దేవరకొండపై సింగరేణి కార్మికుడిగా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. అయితే కథలోని కొన్ని సన్నివేశాల్లో మాత్రమే విజయ్ దేవరకొండ ఇలా కనిపిస్తాడట.

క్లాస్, మాస్ రెండు వర్గాలకు చెందిన ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.