సైమా అవార్డుల్లో ఉత్తమ చిత్రం మహానటి , ఉత్తమ నటుడు రామ్ చరణ్

సైమా అవార్డుల్లో ఉత్తమ చిత్రం మహానటి , ఉత్తమ నటుడు రామ్ చరణ్

ఖతార్‌లో జరుగుతున్న సైమా అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు వైభవంగా మొదలైంది . సైమా 8వ అవార్డుల ప్రదానం లో దక్షిణ భారత తారలంతా హాజరయ్యారు . ఈ వేడుకల తోలి రోజున చిరంజీవి , రెండవ రోజున మోహన లాల్ ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు . మొదటి రోజున తెలుగు , కన్నడ , రెండవరోజున తమిళ , కన్నడ చిత్రాల అవార్డుల ప్రదానం జరుగుతుంది . చిరంజీవి, కీర్తి సురేశ్‌, రాధిక, శ్రియ, పాయల్‌ రాజ్‌పుత్‌, యశ్‌, విజయ్‌ దేవరకొండ ప్రధాన ఆకర్షణగా వున్నారు . .సుమ, హాస్యనటులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వ్యాఖ్యాతలుగా వున్నారు .

సైమా అవార్డుల్లో విజేతలు, ఉత్తమ చిత్రం: మహానటి , ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌, రంగస్థలం , ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: అజయ్‌ భూపతి, ఆర్‌ ఎక్స్‌ 100, ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ ,రంగస్థలం, ఉత్తమ తొలి చిత్ర నటుడు: కల్యాణ్‌ దేవ్‌ విజేత, ఉత్తమ నటుడు (క్రిటిక్‌): విజయ్‌ దేవరకొండ ,గీత గోవిందం, ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ ,మహానటి, ఉత్తమ నటి (క్రిటిక్‌): సమంత ,రంగస్థలం, ఉత్తమ తొలి చిత్ర నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ ,ఆర్‌ఎక్స్‌ 100, ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌ ,రంగస్థలం, ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్‌ ,మహానటి, ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ , రంగస్థలం, ఉత్తమ హాస్యనటుడు: సత్య , ఛలో, ఉత్తమ ప్రతినాయకుడు: శరత్‌ కుమార్‌ , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌, రంగస్థలం- ఎంత సక్కగున్నావే, ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి , రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట, ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి, ఆర్‌ ఎక్స్‌ 100- పిల్లారా.. పాట, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు , రంగస్థలం, ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: మౌనిక రామకృష్ణ , రంగస్థలం, సోషల్ మీడియా సెలెబ్రిటీ : విజయ్‌ దేవరకొండ
ఎంపికయ్యారు .