బికిని ఫోజులో హీరోయిన్, ఆఫర్స్ కోసమే ఈ మారధాన్

                                                                             (సూర్యం)

ఆ మధ్యన నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘ప్రతినిథి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శుభ్ర అయ్యప్ప గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ తర్వాత  ‘యవ్వనం ఒక ఫాంటసీ’ అనే మూవీతో తెలుగులో తన లక్‌ని ఇంకోసారి టెస్ట్‌ చేసుకోవాలనుకుంది కానీ ఫలితం లేకుండా పోయింది. దాంతో వెనకబడి పోయింది.

ఎవరూ పిలిచి సినిమా ఇవ్వటం లేదు. దాంతో  ఇది కాదు పద్దతి అనుకుంది. అసలే మోడలింగ్‌ ఇండస్ట్రీ నుంచి సినిమాల్లోకి వచ్చిన అమ్మాయి కావటంతో కొన్ని టెక్నిక్స్ వాడి తిరిగి లైమ్ లైట్ లోకి రావాలని ఆశిస్తోంది.

అందులో భాగమే ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫొటో. బికినీ ఫోజ్ లో ప్రత్యేకంగా దిగిన ఈ ఫొటో కొంతమందినైనా ఎట్రాక్ట్స్ చేస్తుందని భావిస్తోంది. అయితే ఫొటోలో ఆమె బాగానే ఉంటుంది. కెమెరా ముందుకు వచ్చేసరికే నట శూన్య కావటం దెబ్బ కొడుతోంది అంటున్నారు. ఆమెను సినిమాల్లో తీసుకుందామని వెనకడుగు వేస్తున్న వాళ్లు.

ఇంకా మోడల్ లా ఫోజులు ఇస్తానంటే కుదరదు..సినిమాకు ఓ లాంగ్వేజ్..అందులో నటించేవాళ్లకు ఓ బాడీ లాంగ్వేజ్‌ అవసరం అని చెప్తున్నారు. ఎమోషన్స్ కెమెరా ముందు పండించాలి, ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌ క్యారీ అవ్వాలి. ఇవేవీ శుభ్ర అయ్యప్పలో లేకపోవటమే దెబ్బ కొడుతోందని చెప్తున్నారు.  అయితే ‘యూత్‌కి మాత్రమే’ అనే సబ్జెక్టులతో , శుభ్ర అయ్యప్ప గ్లామర్‌ని కొంతమంది  బాగా క్యాష్‌ చేసుకున్నా వాళ్లకేమో ఆ అవకాసం ఇవ్వటం లేదుట.