కంగారుపడకండి..శృతిహాసనే..కాకపోతే మేకప్ వేసుకోలేదంతే

                                                                (సూర్యం)

హీరోయిన్స్ బయిటకు వెళ్లాలంటే సెక్యూరిటీ సమస్య…దాన్ని అధిగమించాలంటే మేకప్ వేసుకోకుండా వెళ్తే సరి..ఇది జోకే. కానీ శృతిహాసన్ నిజం చేసేటట్లు ఉంది. తన మేకప్ లేని లుక్ ని ఇదిగో నేను ఇలా ఉంటాను అన్నట్లు మీడియాకు వదలింది.

కమల్ హాసన్ కూతురుగా తెరకు పరిచయమైన శృతి హాసన్..అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ బ్రాండ్ ని ముద్రని వేయించుకుంది. అయితే కొత్తలో ఆమెను ఎంకరేజ్ చేసిన వాళ్లు లేరు. వరస సినిమాలు ఫ్లాఫ్. అయితే ఆమె నిరాశపడకుండా ప్రయత్నించి..గబ్బర్ సింగ్ తో ఫామ్ లోకి వచ్చింది. వరస హిట్స్ కొట్టింది. అంతేనా కేవలం ఫ్యామిలీ పాత్రలే కాదు కామసూత్ర టైమ్ సినిమాలు చెయ్యగలనంటూ తోటి హీరోయిన్స్ కు సవాల్ విసిరింది. అంతా బాగానే ఉంది..ఈ మధ్య ఈ అమ్మడు ప్రేమలో పడి…సినిమాలు తగ్గించేసింది. మరీ జనాలు మర్చిపోతారు అనుకుందో ఏమో ..ఇదిగో ఇలాంటి సెల్ఫీ ఒకటి దిగి ప్రపంచం మీదకు వదిలింది.

ప్రస్తుతం ఆమె మ్యూజిక్ ఆల్బమ్ చేస్తోంది. ఆ ఆల్బమ్ ..నవంబర్ లో విడుదల కానుంది. మరో ప్రక్క ఇటాలియన్ ఏక్టర్ ,బోయ్ ఫ్రెండ్  మైకల్ ని సైతం వివాహం చేసుకోవటానికి సిద్దపడుతోంది.  అయితే ప్రస్తుతం చెట్టాపట్టాలు వేసుకుని తిరగటమే..వచ్చే సంవత్సరం పెళ్లి అంటోంది ఈ అమ్మడు. ప్రస్తుతానికి ఈ ఫొటో చూసి హ్యాపీ అయితే తర్వాత విషయాలు తర్వతా చూసుకుందాం.