కమల్ హాసన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఆయన కూతురు శృతి హాసన్, హిందీలో మొదటి సినిమా చేసిన శృతి హాసన్ అతి తక్కువ సమయంలోనే హిందీ.. తెలుగు.. తమిళంలో స్టార్ హీరోయిన్ గా, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఒక స్టార్ వారసురాలు అనే వలయం నుండి శృతి హాసన్ చాలా తొందరగా బయట పడింది. ఆమె నటిగా తనకు తాను ఒక మంచి పేరు దక్కించుకుంది. మూడు భాషల్లో కూడా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న ఈ అమ్మడికి లండన్ కు చెందిన వ్యక్తితో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ప్రియుడితో కలిసి అమ్మడు ఎంతో హంగామా చేసింది, ఇండియాలో కొన్నాళ్ళు లండన్ లో కొన్నాళ్ళు ఉంటూ అమ్మడు ప్రియుడితో కలిసి బాగా ఎంజాయ్ చేసింది.
లండన్ ప్రియుడితో శృతి హాసన్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరు కూడా విడిపోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటిచారు. ఇద్దరి కెరీర్ గోల్స్ వేరు వేరుగా ఉన్నాయి. కనుక ఇద్దరం కలిసి ప్రయాణం చేయడం సాధ్యం అవ్వడం లేదు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసి బ్రేకప్ ను అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అతడి నుండి విడిపోయి ఏడాది దాటినా కూడా శృతి హాసన్ ఇంకా లండన్ జ్ఞాపకాలను వదలలేక పోతుందని ఆమె సోషల్ మీడియా పోస్ట్ లు మరియు ఆమె వ్యాఖ్యలను బట్టి అర్దం అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.