లండ‌న్ వీధుల్లో చిందేసిన‌ స్టార్ హీరోయిన్‌!

స్టార్ హీరోయిన్ శృతిహాస‌న్ రెచ్చిపోయి చిందులేస్తోందేంటి?.. సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో శృతి పోస్ట్ చేసిన ఓ వీడియోని చూస్తే ఎవ‌రికైనా ఇదే అనుమానం క‌లుగుతుంది. న‌టిగా స్టార్ హీరో వార‌సురాలిగా తెరంగేట్రం చేసిన శృతి అన‌తికాలంలోనే ఆ మార్కుని చెరిపేసి స్టార్ కిడ్‌నే కాదు.. టాలెంటెడ్ కూడా అనిపించుకుంది. చిన్న వ‌య‌సులోనే క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన `హేరామ్‌` చిత్రంలో ఓ పాట పాడి ఔరా అనిపించింది. `ఈనాడు` చిత్రానికి ఏకంగా సంగీతం అందించి త‌న‌ టాలెంట్‌ ఏంటో నిరూపించుకుంది.

గత కొంత కాలంగా ఈ మ‌ల్టీటాలెంటెడ్ స్టార్ కిడ్ గ‌త కొంత కాలంగా సినిమాలపై స‌రిగా కాంసంట్రేట్ చేయ‌డం లేదు. దీంతో స్టార్ హీరోయిన్‌ల జాబితాలో కాస్త వెన‌క‌బ‌డింది. బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్స‌ల్‌తో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరిగి చివ‌రికి బ్రేక‌ప్ చెప్పేసిన శృతి తాజాగా `క్రాక్‌` సినిమాతో మ‌ళ్లీ బిజీ అయిపోయింది. షూటింగ్‌లో చిన్న విరామం ల‌భించ‌డంతో లండ‌న్ వెళ్లి త‌న స్నేహితుల‌తో క‌లిసి బ‌ర్త్‌డే పార్టీ చేసుకుంది. లండ‌న్ వీధుల్లో శృతి రెచ్చిపోయి చిందులేసిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన వాళ్లంతా చిత్తుగా తాగి చిందేస్తోందా? అంటూ కామెంట్ చేస్తున్నారు.