తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ లో శ్రద్ధాకపూర్‌?

తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ లో శ్రద్ధాకపూర్‌?

తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన హీరోయిన్లు సాధారణంగా తెలుగులో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే, ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి అందునా, సినీ నేపథ్యం ఉన్న కథానాయికలు టాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు వస్తున్నారు. గతంలో పలువురు కథానాయికలు వచ్చారు. త్వరలో శ్రద్ధాకపూర్‌ తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

ప్రభాస్‌ సరసన ఆమె నటించిన ‘సాహో’ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో రూపొందించిన చిత్రమిది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా సుజీత్‌ దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తర్వాత శ్రద్ధాకపూర్‌ తెలుగులో మరో భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందట. ఓ అగ్రహీరో నటించే చిత్రం కోసం శ్రద్ధాకపూర్‌ని సంప్రదించారట. కథ, హీరో, దర్శకుడు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందట.