రామ్ చరణ్ సరసన ఏ ‘కపూర్’ బ్యూటీ.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా దాదాపు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇది పూర్తయ్యాక, బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్.. అంటూ ప్రచారం జరుగుతోంది.

ఇంతలోనే, ఇంకో కపూర్ బ్యూటీ పేరు రామ్ చరణ్ సరసన.. అంటూ ప్రచారంలోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, ‘సాహో’ ఫేం శ్రద్ధా కపూర్.! అయితే, ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదుట. బాలీవుడ్ సినిమా అట.!

చాలాకాలం క్రితం రామ్ చరణ్ ‘జంజీర్’ అనే సినిమాలో నటించాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్. అదో పెద్ద డిజాస్టర్ మూవీ. ఆ తర్వాత స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ ఇంకేదీ చేయలేదు రామ్ చరణ్.

కానీ, ఇప్పుడు ఈక్వేషన్స్ మారాయ్. రామ్ చరణ్ అంటే, పాన్ ఇండియా హీరో. కాదు కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.! సో, లెక్కలు అనూహ్యంగా మారిపోయాయ్.

ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ఓ పీరియాడిక్ ఫిలింలో రామ్ చరణ్ హీరోగా నటించబోతున్నాడు. ఆ సినిమా కోసమే శ్రద్ధా కపూర్ పేరుని పరిశీలిస్తున్నారట. దాంతో, ‘వద్దు బాబోయ్ ఫ్లాప్ బ్యూటీ’ అంటున్నారు రామ్ చరణ్ అభిమానులు.

అభిమానులు వద్దంటే ఆగిపోదు కదా.! సంజయ్ లీలా భన్సాలీ మనసులో ఏముందో వేచి చూడాలిక.! ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి వుంది.