షాకింగ్ : టాలీవుడ్ ప్రముఖ స్టార్ కమెడియన్ తండ్రి మృతి..!

గత రెండు నెలల సమయాల్లో తెలుగు సినిమా దగ్గర చాలానే విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు స్టార్ మరియు సీనియర్ నటులు సహా నటీ నటుల తల్లిదండ్రులు గాని చనిపోవడంతో వరుస విషాదాలు చోటు చేసుకుంటూ ఇండస్ట్రీలో వచ్చాయి.

అలాగే ఇప్పుడు టాలీవుడ్ లో మరో విషాదం నెలకొన్నట్టుగా సినీ ప్రముఖులు కన్ఫర్మ్ చేశారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ “ఆది”, “అదుర్స్”, “ఖైదీ 150” అలాగే “రేస్ గుర్రం” తదితర ఎన్నో చిత్రాల్లో కనిపించిన నటుడు అదుర్స్ రఘు తండ్రి కన్ను మూసినట్టుగా పలు వార్తలు ఇప్పుడు బయటకి వచ్చాయి.

ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే రఘు తండ్రి కరుమంచి వెంకట రావు గత కొంత కాలం నుంచి క్యాన్సర్ తో బాధ పడుతుండగా ఈ సమస్య తీవ్రం కావడంతో దానితో పోరాటంలోనే తన 74 వ ఏట కన్ను మూసినట్టుగా సినీ వర్గాల వారు తెలిపారు.

దీనితో పలువురు సినీ ప్రముఖులు రఘు పట్ల విచారం వ్యక్తం చేయగా వారి తండ్రి ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. ఈ షాకింగ్ ఘటన తో అయితే టాలీవుడ్ లో మళ్ళీ విషాదం నెలకొందని చెప్పాలి.