టాలీవుడ్ శ్రీరెడ్డి అభిమానులకు షాకింగ్ న్యూస్. శ్రీరెడ్డి హైదరాబాద్ కు గుడ్ బై చెప్పనుందా? చెన్నైలోనే శాశ్వతంగా స్థిరపడనుందా? వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి. కాస్టింగ్ కౌచ్ అంశంతో టాలీవుడ్ లోని పలువురి ప్రముఖులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.
అంతేకాదు పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద విమర్శలు చేసి మెగా ఫ్యామిలీ, పవన్ అభిమానుల నుండి తీవ్ర ఆగ్రహానికి గురయ్యింది. తెలుగునాట తనకు సేఫ్టీ లేదంటూ పలుమార్లు వెల్లడించింది శ్రీరెడ్డి.
ఆ తర్వాత చెన్నై వెళ్లిన ఈ నటి అక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ పేరిట పలువురిపై ఆరోపణలు చేస్తూ మీడియాలో హడావిడి చేసింది. సినిమా అవకాశాలు వస్తే అక్కడే స్థిరపడిపోతాను అంటూ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఆమెకు కోలీవుడ్ లో “రెడ్డి డైరీ” మూవీలో నటించటానికి అవకాశం వచ్చింది. ఈ సినిమా తన స్వీయ చరిత్రలోని సంఘటనలు ఆధారంగా చేసుకుని రూపొందుతుంది. అయితే ఈ సినిమా ద్వారా నిజ జీవితంలో తన లైంగికంగా వాడుకున్న వారి వీడియోలు బహిర్గతం చేయనున్నట్టు ప్రకటించింది.
ఆ వీడియోలు టాలీవుడ్ లోని ప్రముఖులకు సంబంధినవని సమాచారం. ఒకవేళ ఆ వీడియోలు రిలీజ్ చేస్తే సదరు వీడియోలో వ్యక్తులు తనకి హాని తలపెట్టే అవకాశం ఉందని భావిస్తున్న శ్రీరెడ్డి అక్కడే స్థిరపడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా కోలీవుడ్ లో అవకాశాలు వస్తే చెన్నైలోనే స్థిరపడిపోతాను అని ముందే శ్రీరెడ్డి ప్రకటించింది. ఆమె ఆశించినట్టే సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. సో ఈ రెండు కారణాల వలన శ్రీరెడ్డి హైదరాబాద్ కి గుడ్ బై చెప్పనుంది అని టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోను గట్టిగా వినిపిస్తున్న మాట.