బాబు నీవు అమెరికా వెళ్లచ్చు ఈ సారి !

అలంద మీడియా కేసులో జారీ అయిన లుకౌట్‌ నోటీసులు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు తొలగించలేదని శివాజీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆయన అమెరికా వెళ్తుండగా పోలీసులు ఆపారన్నారు. దుబాయి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కూడా ఆపి వెనక్కి పంపారని వివరించారు. ఇమ్మిగ్రేషన్‌ వెబ్‌సైట్‌లో లుకౌట్‌ నోటీసులు తొలగించలేదన్నారు. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని న్యాయవాది కోరారు.గత నెల 24న హైకోర్టు తీర్పు రావడంతో శివాజీ 25న అమెరికా వెళ్లారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత లుకౌట్‌ నోటీసులు తొలగించడానికి మూడు రోజులు పడుతుందని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు సీఐడీకి వెళ్లి అక్కడినుంచి ఇమిగ్రేషన్‌కు వెళ్లాలని పోలీసులు తెలిపారు. భారత్‌లో ఎవరూ కూడా శివాజీని ఆపలేదు. అయితే దుబాయ్‌ ఇమ్మిగ్రేషన్‌ సిబ్బంది ఆపారని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. ఇదంతా సమాచార లోపం వల్ల జరిగిన తప్పిదమని పేర్కొంది. రేపటి నుంచి మూడు వారాల వరకు అమెరికా వెళ్లేందుకు హైకోర్టు మరోసారి శివాజీకి అనుమతి ఇచ్చింది.