ఏంటి శర్వా..నువ్వూ అదే పనా..పద్దతి కాదు

తెలుగు సినీ పరిశ్రమలో ఏ శాతం సక్సెస్ రేటు ఉందో..తమిళంలో చిత్ర పరిశ్రమలోనూ దాదాపు అంతే ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువే ఉంది. అయితే మన హీరోలకు తమిళ దర్శకులంటే మోజు మాత్రం పోవటం లేదు. మొన్నటికి మొన్న మహేష్ స్పైడర్ తో డిజాస్టర్ ఇచ్చినా మిగతా హీరోలు దాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు. ఎంతసేపూ తమిళ దర్శకుడుతో సినిమా చేస్తే అక్కడ కూడా తమ సినిమాలు ఆడే అవకాసం ఉంటుందనే ఆలోచిస్తున్నారు.

అదే తమిళ హీరోలు అయితే తమ డైరక్టర్స్ తోనే సినిమాలు చేస్తారు. ఒక్కరంటే ఒక్కరు కూడా మన తెలుగు దర్శకులకు అవకాసం ఇచ్చిన పాపాన పోరు. సర్లేండి ఇదంతా మాకు తెలిసి ఉన్నదేగా ..ఇప్పుడెందుకు చెప్తున్నారు అంటే…శర్వానంద్ కూడా తన వెనక తిరుగుతున్న తెలుగు దర్శకుల క్యూని కాదని..తమిళ దర్శకుడు తిరుకు డేట్స్ ఇచ్చారు. తమిళ దర్శకుడు తిరు..గతంలో విశాల్ తో రెండు సినిమాలు చేసారు.

అయితే శర్వా ఒప్పుకోవటానికి కారణం ..తిరు చాలా ఇంట్రస్టింగ్ కథతో వచ్చాడని అంటున్నారు. అయితే తిరు రెండు సినిమాలు చూసిన వారికి అతను ఎంతమాత్రం గొప్ప కథతో సినిమా చేస్తాడనేది తెలిసిన విషయమే. పైకి కథ కోసమే అన్నా…కేవలం తమిళ మార్కెట్ కోసం..తను గతంలో జర్నీతో తెచ్చుకున్న మార్కెట్ ని తిరిగి పునరిద్దరించుకోవటం కోసమే శర్వా ఈ సినిమా చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమాని ఎకె ఎంటర్టైన్మెంట్ అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. శర్వానంద్ తో ఆయన చాలా కాలంగా సినిమా చేద్దామనుకుంటూంటే ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. మంచి బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. బెస్టాఫ్ లక్ శర్వా.