(ధ్యాన్ )
సమంత ఏం చేసినా చాలా పక్కాగా చేస్తోంది. ఎంతో ప్లానింగ్‌తో చేస్తోంది. అయితే ఈ సారి మాత్రం ఆమె ఇరకాటంలో పడింది. ఆమె తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటించిన ‘సీమరాజా’ ఈ నెల 13న విడుదదల కానుంది. అదే సమయంలో ఆమె తెలుగులో నటించిన ‘యు టర్న్’ కూడా ఇక్కడ అదే తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూహ్యంగా ఆమె భర్త నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా సేమ్ డేట్‌లో విడుదలవుతోంది. ‘యు టర్న్’ సినిమా విషయంలో ముందు నుంచీ స్పెషల్ కేర్ తీసుకున్న సమంత సినిమా విడుదల సమయంలో పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించడం లేదని పరిశ్రమ వర్గాల టాక్. 13న విడుదల కానున్న ‘శైలజారెడ్డి అల్లుడు’కు సంబంధించి ఇప్పటికే రకరకాలుగా పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలయ్యాయి. కానీ సమంత మాత్రం కేవలం సోషల్ మీడియా మీద భారం వేశారు. మరోవైపు ఆమెను నెక్స్ట్ నయనతారగా అందరూ ఊహించుకుంటున్నారు. నయనతార నటించిన ‘కో కో కోకిల’ వసూళ్లను ఆమె చిత్రం ‘ఇమైక్కా నొడిగల్’ క్రాస్ చేసింది. నయనతార తర్వాత అంత స్టామినా ఉన్న నటి సమంత అని అంతా అనుకుంటున్నారు. ఆమె యు టర్న్ కూడా మంచి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ప్రపంచం మొత్తం అంచనాలు పెంచుకుంటున్న ఈ తరుణంలో సమంత కొంచెం సైలెంట్ కావడం న్యాయమేనా?