షారూక్ డిప్రెషన్ లో ఉన్నాడా?..ఈ డెసిషన్ ఏంటి ?

బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ ప్రస్తుతం చాలా గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. ఊహించని విధంగా వరస డిజాస్టర్స్ ఆయన్ని పూర్తిగా నిరాశలోకి తోసేసాయి. గత షారూఖ్ చిత్రాల పెర్ఫార్మెన్స్ ని, ఇప్పుడు చేస్తున్న సినిమాలతో పోల్చి చూస్తుంటే బాలీవుడ్ కి కింగ్ ఖాన్ ఇక మీదట కింగ్ ఖాన్ కాదు అని బాలీవుడ్ మీడియా తేల్చేసింది.

దాంకో షారూక్‌ఖాన్ కొత్త సినిమాలేవీ అంగీక‌రించ‌డం లేదు. `జీరో` సినిమా త‌ర్వాత షారూక్ క‌థ‌లు వింటున్నారు కానీ.. ఏ సినిమాకు కూడా ఓకే చేయలేదు. ఈ విష‌యాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చెప్పారు. ఆ మధ్యన రాకేశ్ శ‌ర్మ బ‌యోపిక్ `సారే జ‌హాసే అచ్చా`, `డాన్ 3` సినిమాల్లో షారూక్ న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి.

రీసెంట్ గా ఆయ‌న త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. తాను ఏ సినిమా చేయ‌లేద‌ని, కొన్ని రోజుల వ‌ర‌కు సినిమాలు చేయ‌కూడ‌ద‌ని అనుకుంటునట్లు తెలిపారాయ‌న‌. వ‌రుస సినిమాలు చేస్తూ వ‌చ్చిన త‌న‌కు కుటుంబంతో గ‌డిపే స‌మ‌యం దొర‌క‌లేద‌ని, పిల్ల‌లు ఎదుగుతున్నారు.

వారితో స‌మ‌యాన్ని గ‌డ‌ప‌క‌పోతే ఎలా? అందుక‌నే కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాన‌ని అన్నారు. అలాగే ఖాళీ స‌మ‌యాల్లో పుస్త‌కాలు చ‌దువుతున్నాన‌ని కూడా అన్నారాయ‌న‌. అయితే అభిమానులు ఇవన్నీ ఆయన నిరాశలోంచి వచ్చిన మాటలే నని, ఎవరికైనా ప్లాఫ్స్ సహజమేనని ఇలా సినిమా చేయకుండా గడిపితే ఎలా అంటున్నారు. అదీ నిజమే మరి.