కెమెరా కళ్లన్నీ ఆ బ్యూటీ మీదే.. !?

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ గణేశ్‌ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారని తెలిసిందే. అంబానీ కుటుంబానికి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన ఇంట ఏదైనా వేడుక జరిగితే బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌తోపాటు వివిధ సినీ పరిశ్రమలకు చెందిన హీరోహీరోయిన్లు, ఇతర ప్రముఖులకు ఆహ్వానం అందిస్తుంటారు.

ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు సందడి చేశారు. అంబానీ ఇంట గణేశ్‌ చతుర్థి వేడుకల్లో ఆయా ఇండస్ట్రీకి చెందిన హీరోహీరోయిన్లు సందడి చేశారు. ముఖ్యంగా నేషనల్‌ క్రష్‌ రష్మికా మందన్నా ఈ వేడుకల్లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. కెమెరా కళ్లన్నీ చీరకట్టులో క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో సింగిల్‌గా వెళ్తున్న రష్మిక మందన్నాపైనే పడ్డాయి. రష్మికా జీ అంటూ మీడియా సిబ్బంది ఈ బ్యూటీని తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు.

ఇప్పుడీ విజువల్స్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్‌ నుంచి షారుఖ్‌ ఖాన్‌-గౌరీ ఖాన్‌ ఫ్యామిలీ, సల్మాన్‌ ఖాన్‌, మాధురీ దీక్షిత్‌ దంపతులు, పూజా హెగ్డే, రకుల్‌ ప్రీత్‌ సింగ్-, జాకీ భగ్నానీ, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, రన్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొణె, నయనతార-విఘ్నేష్‌ శివన్‌, కియారా-సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌-జెనీలియా, అతియా శెట్టి`కేఎల్‌ రాహుల్‌, అహాన్‌ శెట్టి, అనన్య పాండే, సారా అలీఖాన్‌, ఇబ్రహీం ఖాన్‌, జాన్వీ కపూర్‌, అలియా భట్‌, శ్రద్ధా కపూర్‌, హేమమాలిని, రేఖా, కరిష్మా కపూర్‌, షాహిద్‌ కపూర్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, రోహిత్‌ శెట్టి, ఆదిత్యా రాయ్‌ కపూర్‌, అర్జున్‌ కపూర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.