శేఖర్ మాస్టర్ ఓ పులిహెర రాజా.. అందరి నోట అదే మాట

Sekhar Master Performance WIth Poorna In ETV 25th Anniversary Celebration

పులిహోర అనే పదానికి ఇప్పుడు అర్థమే మారిపోయింది. పులిహోరను ప్రసాదంగా చూసే రోజులన్నీ మారిపోయాయి. ఇప్పుడు పులిహోర అనే పద స్వరూపం మారి.. అందరికీ ఓ రకమైన ఫీలింగ్ వచ్చేసింది. బుల్లితెరపై వేసే సెటైర్స్‌తో పులిహోర మీనింగే మారిపోయింది. పులిహోర రాజా, పులిహోర కలపడంలో సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్‌లు దిట్టా అని అందరూ ఏకరువుగా సెటైర్స్ వేయడంతో అందరిలోనూ అదే ముద్ర పడిపోయింది.

Sekhar Master In Cash Show

జబర్దస్త్, ఢీ షోల్లో సుడిగాలి సుధీర్‌పై దాదాపు ఇలాంటి సెటైర్సే పడుతుంటాయి. ఇక సుధీర్‌తో పాటు శేఖర్ మాస్టర్‌కు ఆ ట్యాగ్‌ను అంటగట్టారు. ఎంతలా అంటే ప్రతీ ఒక్కరూ అది నిజమని భ్రమపడే స్థాయికి తీసుకొచ్చారు. తాజాగా క్యాష్ షో ప్రోమో విడుదల చేశారు. అందులోనూ శేఖర్ మాస్టర్‌ను పులిహోరతో ఓ ఆట ఆడుకున్నారు. సుమ, అనసూయ, రష్మీ, హైపర్ ఆది అందరూ కలిసి సెటైర్ల మీద సెటైర్లు వేశారు.

ఈ మధ్య క్యాష్ షోలో పార్టిసిపెంట్ చేసే వారికి తినే వస్తువులు మొదటగా ఇస్తున్నారు. వాటిని తినిపించి ఆపై షోలోకి తీసుకుంటున్నారు. ఆ రకంగా ఈ సారి పులిహోరను ఏర్పాటు చేశారు. ఆ పులిహోరను శేఖర్ మాస్టర్ అందించిన సుమ.. పులిహోర అంటూ ఓ టైపులో సెటైర్ వేసింది. ఇక వెంటనే శేఖర్ మాస్టర్.. ‘ఈ పులిహోర మిర్చి ఎందుకు వేశారు?‘ అని అనడంతో.. ‘మీరు కలిపే పులిహోరలో మిర్చి ఉండదా?’ అని సుమ రివర్స్ కౌంటర్ వేసింది.

Sekhar Master In Cash Show

ఇక ఆ తదుపరి వచ్చిన రష్మీకి సుమ పులిహోర అందింస్తూ వారు కలిపారు అంటూ శేఖర్ మాస్టర్‌ను చూపించింది. ‘మాస్టర్ మీరు కలిపారా?’ అంటూ ఎంతో ఆశగా ఆడిగింది రష్మీ. ఇక తరువాత వచ్చిన అనసూయను.. ఫస్ట్ ఆ పులిహోర తీసుకో అని సుమ ఆదేశించింది. అప్పుడే కలిపేశారా? మాస్టర్ అంటూ శేఖర్ మాస్టర్ వైపు చూసుకుంటూ అనసూయ ఓ కౌంటర్ వేసింది. చివరగా వచ్చిన హైపర్ ఆది పులిహోరను చూస్తూ.. శేఖర్ మాస్టర్ కలిపాక కూడా మిగిలిందా? అని పంచ్ వేశాడు. ఇక ఇదే సమయంలో శేఖర్ మాస్టర్‌ను చూపిస్తూ రాజా సినిమా బ్యాక్ గ్రౌండ్‌, వెంకటేష్ డైలాగ్‌లతో ఎడిటింగ్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. మొత్తానికి ఇలా అందరూ కలిసి శేఖర్ మాస్టర్‌ను పులిహోర రాజాను చేసేశారు.