వరుస డిజాస్టర్లతో కెరీర్ పరంగా డైలమాలో పడ్డాడు శర్వా నంద్. పడి పడి లేచే మనసు- రణరంగం- జాను (96 రీమేక్) చిత్రాలు ఆశించిన విజయాల్ని అందించలేదు. దీంతో పూర్తిగా డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. అయినా సక్సస్ తో పని లేకుండా వరుసగా సినిమాలకు కమిటయ్యాడు ఈ యంగ్ హీరో.
తన హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్ కి ఇప్పటికే కమిటయ్యాడు. ఈ సినిమాకి శ్రీరామ్ అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తాడు. అలాగే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనీల్ సుంకరకు ఓ సినిమాకి కమిటయ్యాడు. ఈ రెండిటి అప్ డేట్ ఏంటి? అన్నది తెలియాల్సి ఉందింకా. ఇప్పటికి స్క్రిప్ట్ లు లాక్ చేశారు. లాక్ డౌన్ అనంతరం షెడ్యూల్స్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక యువీ సంస్థ ప్రత్యేకించి శర్వాపై కేర్ తీసుకోనుందట. ఇంతకుముందు రన్ రాజా రన్ తో బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చి అటుపై ఎక్స్ ప్రెస్ రాజా- మహానుభావుడు లాంటి చిత్రాల్ని తెరకెక్కించింది ఈ సంస్థ. ప్రస్తుతం మారుతి సహా పలువురితో స్క్రిప్టులు రెడీ చేయిస్తోంది. శర్వా- యువీ సినిమా అక్టోబర్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.