“సర్కార్ “సెలెబ్రేషన్స్

వాద  వివాదాల మధ్య “సర్కార్ ” సినిమా కలెక్టన్స్ వర్షం కురిపిస్తుండటంతో యూనిట్ అంతా మహా సంతోషంగా వుంది . రాజకీయ నేపథ్యంతో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా సన్ పిక్చర్స్ వారు ఈ సినిమా నిర్మించారు . అయితే  ఈ సినిమా ఏ ముహూర్తాన  మొదలు పెట్టారో  అప్పటి నుంచి  కస్టాలు వెన్నాడుతూనే వున్నాయి . అయినా అన్నింటినీ తట్టుకొని  “సర్కార్ ” దీపావళికి విడుదలైంది .

ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సాధిస్తున్న విజయాన్ని యూనిట్ సభ్యులంతా కలసి చెన్నైలో కేక్  కట్ చేసి మరీ సెలెబ్రేట్ చేసుకున్నారు . దర్శకుడు మురుగ దాస్ , విజయ్ మిగతా నటీనటులు, సంగీత దర్శకుడు రెహ్మాన్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా దర్శకుడు , నిర్మాత కు అభినందనలు తెలిపారు .