అమితాబ్ కూడా లైంగికంగా వేధించారా?

‘మీ టూ’ ఉద్యమం బాలీవుడ్ ను  కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నటులు, దర్శకులపై వస్తున్న ఆరోపణల కారణంగా భారీ చిత్రాలే ఆగిపోతున్నాయి. ఎవరూ ఊహించని దర్శక,నిర్మాతలు ఈ మీటూ వివాదంలో మీడియాకు ఎక్కుతున్నారు.  తాజాగా అమితాబ్ సైతం ఈ ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తున్నారు.

‘మీ టూ’ గురించి రీసెంట్ గా అమితాబ్ ట్విట్టర్‌లో స్పందించిన విషయం తెలిసిందే. ‘మహిళలు పని ప్రదేశాల్లో ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అవి తలచుకొంటుంటే చాలా బాధగా ఉంటుంది. వారికి గౌరవం, రక్షణ ఇవ్వకపోతే దేశంపైనే పెద్ద మచ్చ పడుతుంది’’ అని  అన్నారు.


అయితే ఈ విషయమై  బాలీవుడ్‌ హెయిర్‌ స్టైలిష్ట్‌ సప్నా మోతీ భవ్నానీ స్పందించారు. ‘‘ఇది చాలా పెద్ద అబద్ధం. సర్‌ మీరు నటించిన ‘పింక్‌’ వచ్చింది వెళ్లింది. అలాగే మీకున్న సామాజిక వేత్త అనే పేరు కూడా పోతుంది. త్వరలోనే మీ గురించిన నిజాలు బయటకొస్తాయి. నా ట్వీట్‌ చదివి కంగారుగా గోళ్లు కొరుక్కుంటారు. మీరు కొరుక్కోవడానికి మీ గోళ్లు సరిపోవు’’ అని ట్వీట్‌ చేసి షాక్ ఇచ్చారు. ఈ నేఫధ్యంలో అమితాబ్‌ గురించి ఏం నిజాలు బయటపడతాయో అని బాలీవుడ్ అంతటా ఆసక్తి మొదలైంది.