టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగ పేరిప్పుడు బాలీవుడ్ లో మారుమ్రోగిపోతోంది. కబీర్ సింగ్ హిట్ తో షాహిద్ కపూర్ కెరీర్ కే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. 300 కోట్ల వసూళ్లతో సునామీ సృష్టించాడు. తెలుగోడు బుర్రకి పదును పెడితే ఎలా ఉంటుందో బాలీవుడ్ కి చాటి చెప్పాడు. తెలుగు ట్యాలెంట్ ను విమర్శించిన వాళ్లందరికీ కబీర్ సింగ్ ఓ చెంప దెబ్బ. రివ్యూలు నెగిటివ్ గా వచ్చినా సందీప్ వంగ ముందు చిన్నబోయాయి. ఈ నయా ట్యాలెంట్ బాలీవుడ్ కొనసాగిస్తుడా? టాలీవుడ్ లా కొనసాగుతాడా? అన్నది సెకెండరీ. బాలీవుడ్ యంగ్ హీరోలంతా ఇప్పుడు సందీప్ తో సినిమా చేయడానికి అమితాసక్తి చూపిస్తున్నారు. అంతా హిట్ మహిమ. అయితే ఈ విషయాన్ని గ్రహించిన బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సందీప్ ని లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడుట. అయితే మహేష్ బాబు కి ఎపుడు సక్సెస్ ఉన్నవాళ్ల వెంటపడటం అలవాటు అయితే సీబీమా చేస్తాడా లేదా అని వేచి చూడాలి .
సందీప్ వంగ నెక్స్ట్ బాలీవుడ్ కా టాలీవుడ్ కా ?
