శ్రీకాకుళం తూఫాన్ బాధితుల కోసం సంపూర్ణేష్ బాబు

వారం రోజుల నుండి శ్రీకాకుళం ను తిత్లీ తూఫాన్ హోరెత్తించింది. వరదల దాటికి పేద, ధనిక వర్గాలు అన్న బేధాలు లేకుండా అందరూ బాధితులయ్యారు. ఈ క్రమంలో తూఫాన్ బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఆలా తన వంతు సాయం అందించటానికి ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు ముందుకు వచ్చాడు.  50,000 రూపాయలను విరాళంగా ఇచ్చాడు.

సంపూర్ణేష్ బాబు గొప్ప హృదయానికి సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది.