చెప్పుకోవటానికి తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నా ..పెట్టిన పెట్టుబడి ని బిజినెస్ రూపంలో తెచ్చే హీరోలు మాత్రం అతి తక్కువ. దాంతో అందరూ కాస్తంత బిజినెస్ ఉన్న హీరో వెనకే పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఓ మాదరి నిర్మాతకు, దర్శకుడుకు హీరోలు డేట్స్ దొరకటం లేదు. చాలా కాలం వెయిట్ చెయ్యాల్సి వస్తోంది. అలాగని ఎవరితో పడితే వారితో సినిమా చేస్తే అక్కడితో కేరీర్ ఖతం. ఇప్పుడు సంపత్ నంది పరిస్దితి కూడా అదే. అందుకే వేర్వేరు హీరోలను ట్రై చేసి చివరకు కళ్యాణ్ రామ్ దగ్గర తేలాడు.
కెరీర్ మొదట్లోనే రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా తీసిన సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా క్యాన్సల్ అయ్యింది. దాంతో సంపత్ నంది ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. దాంతో కళ్యాణ్ రామ్ కోసం స్క్రిప్ట్ కూడా పూర్తిగా మార్చి రాసాడట. రీసెంట్ గా సంపత్ చెప్పిన ఫుల్ స్క్రిప్ట్ నేరేషన్ కళ్యాణ్ రామ్ కి కూడా బాగా నచ్చిందట.
దాంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు.