సమంత ఇంత హాట్ డ్రస్ లోనా.. స్టన్ అవుతున్నారు

                                                 (సూర్యం)

సమంత కెరీర్ మొదట్లో ఎలా ఉన్నా…తర్వాత రోజుల్లో తనపై గ్లామర్ డాల్ అనే ముద్రను చెరిపేసుకుని నటనకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. దానికి తగ్గట్లే ఆమె బికినీ వంటివి వేయకపోవటం, ఇప్పుడు అక్కినేని వారి ఇంటి కోడలు అవటం వంటి విషయాలు ఫ్యామిలీ లుక్ తెచ్చి పెట్టేసాయి. అయితే పెళ్లయ్యాక ఆమె తన భర్త,మరిదితో కలిసి యూరప్ టూర్ కు వెళ్లింది. ఎక్కడికి వెళ్లినా తన అభిమానులు డిటేల్స్ ఇస్తోంది.

ముఖ్యంగా ఈ టూర్ కు సంభందించి ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిన్న ..స్పెయిన్ లోని ఓ ఫేమస్ నైట్ క్లబ్ లో చైతు, అఖిల్ తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్న ఫొటో  ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తాజాగా ఇదిగో ఇలా రెడ్ టూ పీస్ స్కర్ట్ లో ఓ ఫోజ్ ఇచ్చి పిచ్చిలేపింది.

ఇప్పుడీ ఫొటో ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యి కూర్చుంది. ఈ ఫొటో చూసిన వారంతా ఎక్సట్రీమ్  హాట్ అంటూ కామెంట్స్ చేసేస్తున్నారు. ఆమె మాత్రం ఇవేమీపట్టించుకోకుండా హాయిగా రిలాక్స్ అవుతూ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది.