సమంత మిడిల్ ఫింగర్ చూపెట్టి..దొబ్బయ్ మంది

సమంత  జోలికి వెళ్తే ఏం జరుగుతుందనేది గతంలో చాలా సార్లు సోషల్ మీడియా జనాలకు పరిచయమే. అయినా ఆమె మీద ప్రేమ, అభిమానం అంటూ ఆమెకు బోడి సలహాలు ఇచ్చే పోగ్రాం పెట్టుకుంటే ఆమె ఇచ్చే కౌంటర్స్ వాళ్లకు కొరివితో తలగోక్కున్న ఫీలింగ్ తీసుకువస్తాయి. గతంలో ఆమె బికినీ వేసినప్పుడు ..మీ పని మీరు చూసుకోండి అని కౌంటర్ ఇచ్చిన ఆమె  తాజాగా మరో సారి తనకు క్లాసులు పీకే వారికి మిడిల్ ఫింగర్
చూపించింది. అసలేం జరిగింది…

రీసెంట్ గా సమంత  తన భర్త నాగచైతన్యతో కలిసి స్పెయిన్ వెళ్లి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది. పనిలో పనిగా సమంత తను ఎక్కడున్నానో చెప్తూ ఫొటోలు అప్ లోడ్ చేస్తూ అప్ డేట్స్ ఇవ్వటం చేస్తోంది. ఆ ఫొటోలు కాస్త హాట్ గా ఉన్నాయి. దాంతో కొందరు సమంతపై అభిమానం ఒలకపోస్తూ..ఇలాంటి డ్రస్ ఏంటమ్మా ..తప్పు కదా అన్నారు. మరికొందరు మరో అడుగు ముందుకు వేసి..పెళ్లైన అమ్మాయివేనే…ఈ వేషాలేంటి అంటూ ట్రోల్ చేయటం మొదలెట్టారు. దాంతో సమంతకు యాజ్ యూజువల్ గా కాలింది.

వెంటనే ఓ ఫింగర్ ఇమేజ్ ని పోస్ట్ చేసి… పెళ్లి తర్వాత నా జీవితంలో నేనేం చేయాలో చెప్పడానికి హక్కు ఉందని భావించే వారందరికి అంటూ కాప్షన్ పెట్టింది. ఆమె ఇంతలా రియాక్ట్ అవుతుందని ఊహించని వాళ్లు షాక్ అయ్యారు. కాబట్టి సమంత విషయంలో కాస్త కంట్రోలుగా ఉండండి.