డార్లింగ్ ప్రభాస్ పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా క్రేజీ సినిమాలకు సంతకాలు చేస్తూ ప్రభాస్ అంతకంతకు హీట్ పెంచేస్తున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్న డార్లింగ్ తదుపరి నాగ్ అశ్విన్ .. ఓం రౌత్ ల సినిమాలకు కమిటయ్యాడు. ఇవి రెండూ భారీ పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలు కావడంతో అతడు ఈ సినిమాలకు ఏ రేంజు పారితోషికాలు అందుకుంటున్నాడు? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ ఒక్కో సినిమాకి 80-90 కోట్ల రేంజ్ పారితోషికం అందుకుంటున్నాడు. దాంతో పాటు అదనంగా ఏరియా రైట్స్ .. శాటిలైట్ హక్కుల్ని డిమాండ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే ఓవరాల్ గా ఒక్కో సినిమాకి సుమారుగా 100 కోట్లు అతడికి వర్కవుటవుతోంది.
ప్రస్తుతం రాధేశ్యామ్ – ప్రభాస్ 21 – ఆది పురుష్ (ప్రభాస్ 22) చిత్రాల్లో నటిస్తున్నాడు కాబట్టి ఆ మూడు సినిమాలకు కలిపి ఏకంగా 240 కోట్ల పారితోషికం అతడి ఖాతాలో పడుతుంది. మరో 50-60 కోట్లు కలుపుకుని ఓవరాల్ గా 300 కోట్లు ఆర్జించే వీలుందని అంచనా. ఇతర రైట్స్ రూపంలో అదనపు మొత్తం కలిపితే ఇంత పెద్ద మొత్తం దక్కనుంది. ఈ మూడు చిత్రాలకు ఫలానా ఏరియా రైట్స్ కావాలని ముందే ప్రభాస్ డీల్ కుదుర్చుకున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ చిత్రాన్ని 3డిలో హిందీ-తెలుగు భాషల్లో తెరకెక్కించి ప్రపంచంలో చాలా భాషల్లో రిలీజ్ చేయనున్నారు.