భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరుతనయుడు రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావటంతో సినిమా మీద అంచనాలు పెంచేందుకు చిత్రయూనిట్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ సినిమాకు పవన్ కల్యాణ్ వాయిస్‌ఓవర్ అందించిన ఫోటోలను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
స్వయంగా చిరు మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గరుండి పవన్‌తో డబ్బింగ్ చెప్పించారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ సుధీర్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడ అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నారు.