మహేష్ లుక్స్ పై సాయిపల్లవి కామెంట్స్ !

మహేష్ బాబు .. తెలుగు చిత్ర పరిశ్రమలో అందానికి నిలువెత్తు నిదర్శనం. సినీ ఇండస్ట్రీ లో ఆల్ టైం మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. మహేష్ ఏజ్ పెరిగేకొద్ది , వయస్సు తగ్గినట్టు మరింత యంగ్ గా కనిపిస్తున్నారు. అంత హ్యాండ్సమ్ గా కనిపించే ఈ స్టార్ హీరో కోసం ఇప్పుడు యూత్ లో మంచి ఫేమ్ అందుకున్న నాచురల్ లుకింగ్ హీరోయిన్ సాయి పల్లవి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

Mahesh Babu

మహేష్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటరాని ఆయన లాంటి లుక్స్ ఉండడం ఎవరికీ సాధ్యం కాదని ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే మహేష్ ఫొటోస్ ను కూడా జూమ్ చేసి చూస్తానని తన స్కిన్ ఎలాంటి మచ్చ లేకుండా నీట్ గా ఉంటుంది అని కామెంట్ చేసింది. ఇది మాత్రం మహేష్ ఫ్యాన్స్ కు మరింత కిక్కిచ్చే వార్తే అని చెప్పాలి.

ఇప్పటికే సాయి పల్లవి ఓ ఫెయిర్ నెస్ కంపెనీ ఇచ్చిన భారీ డీల్ ను వదులుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జాతీయ మీడియా కూడా తనపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. తాజాగా సాయిపల్లవి కొత్త వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది.