‘చిత్రలహరి’ స్టోరీ, టాక్:హైలెట్స్, మైనస్ లు

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘చిత్రలహరి’. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివి మోహన్ నిర్మాతలు. నివేదా సేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తన్న ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా (ఏప్రియల్ 12న) విడుదలవుతుంది. వరస ఆరు ప్లాఫ్ ల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై సాయి చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం యుఎస్ షోలు పడ్డాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టాక్, కథ ఏంటో చూద్దాం.

యుఎస్ నుంచి అందుతున్న టాక్ ప్రకారం.. కోర్ట్ లో నిందితుడుగా నిలబడ్డ విజయ్ (సాయి తేజ) ..జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తూంటాడు. ఈ క్రమంలో సాఫీగా జరిగిపోతున్న అతని జీవితం కోర్ట్ దాకా ఎందుకు లాగబడిందో గుర్తు వస్తుంది. ప్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. టివి సర్వీస్ సెంటర్ లో పని చేసే సాయిని దురదృష్ణం లో ఓ రేంజ్ లో వెంటాడుతుంది. అతని బుర్ర నిండా చాలా ఆలోచనలు, ఐడియా లు ఉన్నా ఎవరూ అతన్ని గుర్తించరు. చివరకు అతని గర్ల్ ఫ్రెండ్ (కల్యాణి ప్రియదర్శిని) సైతం అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది. అతని స్టార్టప్ ఐడియాని బ్రహ్మాజీకాపీ కొట్టేద్దామనుకుంటాడు. అతనితో గొడవ అవుతుంది.

సాయికి పరిచయం అయిన నివేత పేతురాజ్ అతనికి ఓ ఇన్విస్టర్ ని పరిచయం చేస్తుంది. అతని స్టార్టప్ ఐడియా యాక్సిడెంట్ అలారం సిస్టమ్. అయితే అక్కడ కూడా అతని ఐడియా రిజెక్ట్ చేయబడుతుంది. దాంతో పూర్తి నిరాశలో పడిపోతాడు. తన పై తనే నమ్మకం కోల్పోయే పరిస్దితి వస్తుంది. ఈ నేపధ్యంలో తన స్టార్టప్ ఐడియాని తనే ప్రయోగం చేసి సక్సెస్ అవుతుందో లేదో చూడాలనుకుంటాడు. అందుకోసం ఓ యాక్సిడెంట్ ని తనే క్రియేట్ చేసుకుంటాడు. ఆ క్రమంలో అతను సూసైడ్ ఎటెమ్ట్ చేసాడని కోర్ట్ కు తీసుకురాబడతాడు అన్నమాట. చివరకు కోర్ట్ అతని ప్రయత్నాన్ని అర్దం చేసుకుంటుంది. అతని స్టార్ట్ అప్ సక్సెస్ అవుతుంది. మొత్తానికి శుభం కార్డ్ పడుతుంది.

జీవితంలో లో అపజయాలను చూసే వ్యక్తి పాజిటివ్ ఆలోచనలతో ఎలా ముందుకు సాగాడు అనే పాయింట్స్ దర్శకుడు తెరపై తనదైన శైలిలో ప్రజెంట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే నివేత పేతురాజ్ సాయికి హెల్ప్ చేసే క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఇక సునీల్ ఒక క్రిస్టియన్ సింగర్ పాత్ర చేశాడు. ఇవి రెండు సినిమాకు హైలెట్ గా నడిచాయి. సాయి కూడా చాలా మెచ్యూర్డ్ గా చేసాడు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది.

సినిమా మొదట్లో పాత్రలను పరిచయం చేసిన విధానం బావున్నా…రొటీన్ సీన్స్ విసిగిస్తాయి. అలాగే కామెడీ కూడా రొటీన్ కామెడీ గా ఉంది. అయితే దర్శకుడు కిషోర్ తిరుమల మార్క్ ఎమోషన్స్ పట్టే అవకాసం ఉంది. నిరాశ, నిస్పృహ వదిలేస్తే సక్సెస్ అవుతామంటూ.. యూత్ కు చెప్పే ప్రయత్నం చేశాడు.