ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఏ నిర్ణయం తీసుకున్న కూడా రామ బాణంలా ఉంటుందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. అమ్మడిపై ఎందుకో అప్పుడప్పుడు ఊహించని విధంగా నెగిటివ్ రూమర్స్ వస్తుంటాయి. టైముకు షూటింగ్ కి రాదని అలాగే రెమ్యునరేషన్ విషయంలో బెట్టు చేస్తుందని డేట్స్ అయిపోతే ఒక్కరోజు కూడా ఎక్కువగా పని చేయదనే రూమర్స్ అప్పట్లో చాలానే వచ్చాయి.
కానీ ఆ రూమర్స్ లలో ఎలాంటి నిజం లేదని చాలా తొందరగానే అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. దిల్ రాజు కూడా సాయి పల్లవి మంచి యాక్టర్ అంటూ పలుసార్లు రూమర్స్ ను ఖండించారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఆమె ఒకసారి దర్శకుడి నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కోన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్పింది సాయి పల్లవి.
ఆమె మాట్లాడుతూ.. కొంతకాలం క్రితం ఒక సినిమా చేస్తున్న సమయంలో దర్శకుడు సడన్ గా హీరోతో లిప్ లాక్ సీన్ లో నటించాలని చెప్పడంతో నేను అందుకు ఒప్పుకోలేదు. పదే పదే అలానే అడుగుతుండడంతో చాలా చిరాకు అనిపించింది. ఇక ఆ సినిమా హీరో కలుగజేసుకొని ఆమెకు ఇష్టం లేనప్పుడు ఎందుకు అనవసరంగా బలవంతం చేస్తున్నారు అని చెప్పాడు. అంతే కాకుండా తేడా వస్తే మీటూ ఆరోపణలతో మనమే ఇబ్బంది పడాల్సి వస్తుందని దర్శకుడికి వివరణ ఇచ్చినట్లు సాయి పల్లవి తెలియజేసింది. మొత్తానికి ఆ విధంగా సాయి పల్లవి మీటూ ఎఫెక్ట్ వల్ల ఇష్టం లేని పని నుంచి తప్పించుకుందట.