(ధ్యాన్)
అప్పుడెప్పుడో లక్ష్మీ.. తులసి సమయంలో నయనతార పేరు తెలుగులో చాలా మారుమోగింది. గోల్డెన్ లెగ్ అనే పేరుతో పాటు సవాలక్ష కండిషన్లు పెడుతోందనీ, ప్రచారాలకు కూడా రానని చెబుతోందని .. అదే విషయాన్ని అగ్రిమెంట్‌లోనూ రాయించుకుంటోందని. ఆ తర్వాత మరే హీరోయిన్ పేరూ ఇంతగా వెలుగులోకి రాలేదు. ఈ మధ్య కాలంలో ఆ లోటును భర్తీ చేస్తోంది సాయిపల్లవి. ఆమెతో నటించడం చాలా కష్టమని, సవాలక్ష ఇబ్బందులు పెడుతుందని నాగశౌర్య నేరుగానే చెప్పాడు. వారిద్దరూ కలిసి నటించిన `కణం` సమయంలో. ఈ మధ్య శర్వానంద్ సెట్లోనూ ఇదే పరిస్థితి అని చూచాయగా తెలిసింది. తాజాగా ఆమె వద్దన్న ఆఫర్ మెహరీన్‌ని వరించింది. శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన సినిమా అది. బెల్లంకొండ కొడుకు సినిమా అనగానే హీరోయిన్లు ఎగురుతూ వచ్చి వాలుతారు. భారీ రెమ్యూనిరేషన్లు ఉంటాయన్నది వాస్తవం. సాయి పల్లవికి కూడా అలాగే ఆఫర్ చేశారట. అయినా ఆమె కచ్చితంగా నో చెప్పేసిందట. కేవలం రెమ్యూనిరేషన్ కోసమే తాను సినిమాలు చేయదలచుకోవడం లేదని చెప్పిందట. తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ, ఎలాంటి ప్రాబ్లమూ, ఎలాంటి చెడ్డపేరూ లేకుండా కొనసాగుతున్న సాయి పల్లవికి తెలుగులోనే ఇన్ని కామెంట్లు ఎందుకు వస్తున్నాయి.. అసలుఉ సంగతేంటి అనేది ఆలోచించాల్సిన విషయం.