రాజకీయాల్లోకి ఇంకా రాలేదు కానీ తన మామయ్య పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమే సాయి ధరమ్ తేజకు. ఎందుకంటే అతన్ని హీరోగా పరిచయం చేయాలని చూసింది పవనే. వైవియస్ చిత్రం రేయ్ లో ఛాన్స్ వచ్చిందీ పవన్ వల్లే. అలా సాయిను సినిమా నటుడుగా నిలబెట్టడం కోసం పవన్ చాలా కృషి చేసారు. ఇప్పుడు అదంతా గుర్తు పెట్టుకున్నాడో ఏమో కానీ …తన మామయ్య పార్టీ గుర్తు ని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లటం కోసం నడుం బిగించాడు. ఇదిగో ఇలా తన తాజా చిత్రం ‘చిత్రలహరి’లో ‘గ్లాస్‌మేట్స్’ అంటూ ఒక పాట పెట్టారు.
గ్లాస్‌మేట్స్ అంటే సాధారణంగా కలిసి మందుకొట్టే ఫ్రెండ్స్ గురించి అంటుంటారు. కానీ పవన్‌కళ్యాణ్ పార్టీ గుర్తు టీ గ్లాస్ కావడంతో ఈ ‘గ్లాస్‌మేట్స్’ పాటని అందుకు అణుగునంగా జనసైనికులు కనక్ట్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సాంగ్ విడుదలకి సంబంధించిన పోస్టర్‌లో కూడా గాజు గ్లాస్ నే హైలైట్ అవడం గమనార్హం.
సినిమా విషయానికి వస్తే.. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘చిత్రలహరి’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘చిత్రలహరి… అప్పట్లో దూర్‌దర్శన్‌లో ప్రతీ శుక్రవారం వచ్చే ఓ ప్రోగ్రామ్. ఈ ‘చిత్రలహరి’ 2019లో ఓ శుక్రవారం విడుదలయ్యే సినిమా. అందులో కొన్ని పాటలు.. ఇందులో కొన్ని పాత్రలు’ అంటూ ధరమ్‌తేజ్ చెబుతున్న డైలాగ్‌తో టీజర్ మొదలై రచ్చ రచ్చ చేసింది. ఇందులో నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటించారు.
ప్రముఖ కమెడియన్, హీరో సునీల్ ఇందులో కీలక పాత్ర పోషించారు. సినిమాలో ఒక్కో పాత్రవి ఒక్కోరకమైన కష్టాలు. అసలు వారి కష్టాలేంటో తెలియాలంటే ఏప్రిల్ 12వరకు వేచిచూడాల్సిందే అంటున్నారు దర్శకుడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.