‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్…ఐటం సాంగ్

                                                                  (సూర్యం)

తన మొదటి  సినిమాతోనే తెలుగు రాష్ట్రాల కుర్రకారుని కిర్రెక్కించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ ముద్దుగుమ్మ త్వరలో ఓ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో తన బోల్డ్ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్న ఈమెకు చిన్నసినిమాలనుంచే కానీ పెద్ద సినిమాల వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు.  ఈ కుర్ర హీరోయిన్.

 ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు..మరో వైపు నటనతోనూ ఆకట్టుకున్నా..అందాల ఆరబోతే అందరికి నచ్చింది. దీంతో ఈ అమ్మడికి జాగా ఐటమ్ సాంగ్ చేయమని ఆఫర్ వచ్చిందన టాక్. తేజ దర్శకత్వంలో  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో ఆమెను ఐటం సాంగ్ చేయంచటానికి మంచి ఎమౌంట్ ఇచ్చి లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

ఏదైమైనా మంచి నటన ఉన్న ఆమెకు తెలుగులో ఆఫర్స్ వస్తాయని ఆమె అభిమానులంతా  ఆశించారు. అయితే ఇలా కేవలం ఐటం సాంగ్ ఆఫర్ రావటం మాత్రం ఏ మాత్రం ప్రోత్సాహకరం  మాత్రం కాదు.