`ఆర్.ఎక్స్ 100` హీరో నెక్స్‌ట్ టైటిల్ ఏంటో తెలుసా?

                                                 (ధ్యాన్)

`ఆర్.ఎక్స్ 100` చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఈ యువ క‌థానాయ‌కుడు ఇప్పుడు క‌లైపులి థాను నిర్మాణంలో సినిమా చేస్తున్నాడు. `నువ్వు నేను ప్రేమ` సినిమాను డైరెక్ట్ చేసిన టి.ఎన్‌.కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌గా.. ఈ ద‌ర్శ‌కుడి తొలి తెలుగు సినిమా కూడా ఇదే అవుతుంది. ఇందులో తొలి చిత్రానికి భిన్నంగా కార్తికేయ క‌నిపిస్తాడు. కేర్‌ఫ్రీ, క్యాజువ‌ల్‌గా సాగే పాత్ర‌లో కార్తికేయ క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టే సినిమా. అక్టోబ‌ర్  నుండి హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ ఉంటుంది.  `నువ్వునేను ప్రేమ‌`, `నెడుంజాలై` త‌ర‌హా ఫ్లేవ‌ర్ మూవీలా ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రానికి `హిప్పీ` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశార‌ట‌. కొన్ని గంట‌ల్లోనే చిత్రానికి సంబంధించి అధికార‌క స‌మాచారం వెలువ‌డ‌నుంది.