“RRR” ప్రకంపనలు..ఏకంగా నెట్ ఫ్లిక్స్ సీఈఓ చూడమంటున్నాడుగా..!

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) సక్సెస్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  సినిమాపై హైప్ తో ఫస్ట్ డే ఆల్ టైం ఇండియన్ సినిమా రికార్డుని అందుకున్న ఈ చిత్రం ఆ తర్వాత 100 కోట్లకి పైగా వసూళ్లతో సెన్సేషన్ ని నమోదు చేసింది.

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ చిత్రానికి భారీ స్థాయి ఆదరణ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక వస్తుంది. ప్రపంచ స్థాయి నుంచి అయితే ఇప్పుడు మన ఇండియన్ సినిమాల్లో ఏ సినిమాకి కూడా రాని స్థాయి ఆదరణను ఈ చిత్రం సొంతం చేసుకుంది.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అయితే ఏకంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ అధినేత టెడ్ సారాండోస్ ఈ సినిమాని ఓ రేంజ్ లో కొనియాడాడు. ఇప్పటి వరకు గాని ఎవరైనా ఈ RRR సినిమాని చూడకుండా ఉంటే డెఫినెట్ గా మిస్ చెయ్యకుండా చూడండి అని, తప్పకుండ ప్రతి ఒక్కరికి ఒక క్రేజీ రైడ్ ని థ్రిల్ ని ఈ సినిమా అందిస్తుంది అని..

నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా హిందీ భాషలో ఇంగ్లీష్ టైటిల్స్ తో ఉంది తప్పకుండా చూడండి అంటూ అందరికి రికమెండ్ చెయ్యగా దానిని ఈ చిత్ర యూనిట్ ఆనందంగా షేర్ చేశారు.

మరి ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించగా బ్రిలియెంట్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించాడు. అలాగే ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు నటించిన ఈ చిత్రం నిన్నటితోనే 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది.