RRR సంక్రాంతి రిలీజ్ అసాధ్య‌మ‌న్న దాన‌య్య‌

లాక్ డౌన్ పొడిగిస్తే RRR లాకైన‌ట్టేనా?

రామారావు-రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రాజమౌళి డైరెక్షనల్ వెంచర్ RRR (రామ రౌద్ర రుషితం) చాలా కాలంగా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్. ప్ర‌తిసారీ మీడియాలో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్. ఈ సినిమా రిలీజ్ ఇటీవ‌ల మ‌రింత హాట్ టాపిగ్గా మారింది. ఈ చిత్రం జనవరి 8 న సంక్రాంతి స్పెషల్ గా రిలీజ‌వుతుంద‌ని టీమ్ ప్ర‌క‌టించింది. కానీ ఇప్పుడు క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో లాక్ డౌన్ ప్రణాళికను మార్చేసింది. సంక్రాంతి విడుదలపై నిర్మాత డీవీవీ దానయ్య ఆశల్ని వదిలేసుకున్నార‌ట‌.

వచ్చే ఏడాది జనవరి 8 న ఈ చిత్రాన్ని విడుదల చేయడం అసాధ్యమని తాజా ఇంటర్వ్యూలో దానయ్య పేర్కొన్నారు. వీఎఫ్‌ఎక్స్ పనులకు గణనీయమైన సమయం అవసరమని, కాబట్టి సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం అసాధ్యమని ఆయన అన్నారు. ప్రభుత్వం అవసరమైన అనుమతులు ఇస్తే, పరిమిత సిబ్బందితో చిత్రీకరణ చేయడానికి ఫిల్మ్ యూనిట్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌లో కొమరం భీమ్ పాత్ర‌లో తార‌క్, అల్లూరి సీతా రామరాజు పాత్రలో చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ప‌లువురు విదేశీ న‌టీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. టాప్ టెక్నీషియ‌న్ల‌తో రాజ‌మౌళి వ‌ర్క్ చేస్తుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. దాదాపు 350 కోట్ల మేర బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. క‌రోనా క‌ల్లోలాన్ని చూశాక అంత స్ట్రాంగ్ గా ఉన్న దాన‌య్య సైతం బెంబేలెత్తుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఈ మాయ‌దారి మ‌హమ్మారీ అనూహ్యంగా త‌న క‌ల‌ల్ని క‌ల్ల‌లు చేసేసిందా? అన్న ఆవేద‌న క‌నిపిస్తోంది.